అర్హులకే పథకాలు అందాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకే పథకాలు అందాలి

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికే అందేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాసమస్యలపరిష్కారమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రగతి ప్రణాళికను సిద్ధం చేయాలని అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టడంతోపాటు పనులు సైతం నాణ్యతగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దారం శంకర్‌, ఖేద్‌ తహసీల్దార్‌ హసీనాబేగం, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఇటీవల బదిలీ అయిన కమిషనర్‌ జగ్జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement