ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జీగా తేజశ్రీ | - | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జీగా తేజశ్రీ

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జీగా పట్లోళ్ల తేజశ్రీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ సభ్యులు నూతన న్యాయమూర్తిని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. కాగా ఇప్పటివరకు ప్రతి శుక్రవారం కోర్టు కార్యకలాపాలు నిర్వహించేవారు. న్యాయమూర్తి తేజశ్రీ బాధ్యతలు చేపట్టడంతో ఇకపై పూర్తిస్థాయిలో కోర్టు కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో న్యాయవాదులు బాలకిషన్‌, శ్రీధర్‌రెడ్డి, మోహన్‌, కృష్ణస్వామి, వెంకటరామిరెడ్డి, నవరత్న, రఘునాథ్‌, రంజిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జూనియర్‌ సివిల్‌ కోర్టు

న్యాయమూర్తిగా హిమబిందు

నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా హిమబిందు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన శ్రీధర్‌ మంథనికి బదిలీకావడంతో ఆయన స్థానంలో హిమబిందును నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement