సంగారెడ్డి టౌన్: గీత కార్మికులకు టీఎఫ్‌టీ లైసెన్సులను మంజూరు చేయాలని గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేసింది. శనివారం నిర్వహించిన కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ఆశన్నగౌడ్ హాజరై మాట్లాడారు. రెండేళ్ల నుంచి కల్లుగీత కార్మికులు 50 ఏళ్ల పైబడిన వారు అనేకమంది లైసెన్సులకు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం నేటికీ మంజూరు చేయలేదని మండిపడ్డారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆన్‌లైన్ మొత్తం బంద్ చేసి పెట్టారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే గీత కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛను రూ.4000కు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గీత కార్మికుల సంఘం
జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్


