మార్కెట్‌ ధర ఇవ్వాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ధర ఇవ్వాల్సిందే..

Mar 3 2026 9:19 AM | Updated on Mar 3 2026 9:19 AM

మెదక్‌ కలెక్టరేట్‌: కోట్లాది రూపాయల విలువైన భూములకు మార్కెట్‌ ధర చెల్లించాలని రామాయంపేట భూ బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సుమారు 60 కుటుంబాలకు చెందిన తమ వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, పట్టా భూములు కమర్షియల్‌ ప్లాట్లు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మార్కెట్‌ విలువ సైతం ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్కుంటున్న విలువ ఎకరాకు రూ.2 నుంచి 3 కోట్లలో ధర పలుకుతుందని తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.8లక్షలు ఇస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ భూములు తప్ప మరో ఆధారం లేని తాము రోడ్డున పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి మార్కెట్‌కు అనుగుణంగా ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ స్పందించి తమకు సరైన పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజవాడ నాగరాజు, దోమకొండ యాదగిరి, రాములు, రాము, యాదగిరి, అశోక్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

కోట్ల విలువైన భూములు లాక్కుంటారా?

కలెక్టరేట్‌ ఎదుట భూ బాధితుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement