ఎకై ్సజ్‌ నిబంధనలను సవరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ నిబంధనలను సవరించాలి

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి : ఇటీవల ప్రోహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ విడుదల చేసిన బదిలీ నిబంధనలను సవరించాలని టీపీసీసీ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఎకై ్సజ్‌ శాఖలో పనిచేస్తోన్న కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు వారి సొంత జిల్లాలో పనిచేయకూడదంటూ సాధారణ బదిలీ నిబంధనల్లో చేర్చిన 8 (ఎఫ్‌)క్లాజ్‌ను తొలగించాలంటూ జిల్లాలోని ఎకై ్సజ్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు శుక్రవారం జగ్గారెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ...ఎకై ్సజ్‌ ఉద్యోగుల సమస్యను ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కిందిస్థాయి ఉద్యోగుల విషయంలో 8 (ఎఫ్‌)క్లాజ్‌ను విధించడం సరికాదన్నారు. ఈ నిబంధన వల్ల సంగారెడ్డి జిల్లాలోని 150మంది కానిస్టేబుళ్ల కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా 3000 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. రానున్న రెండేళ్లలో రిటైరయ్యే హెడ్‌ కానిస్టేబుళ్లు సైతం ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ఈ నిబంధనతో ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా ఉండటంతోపాటు, వారి పిల్లల చదువులపై సైతం తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

భూలక్ష్మమ్మ ఆలయం పునఃనిర్మిస్తాం

గతంలో జాతీయ రహదారి విస్తరణలో తొలగించిన భూలక్ష్మమ్మ గుడిని తిరిగి రోడ్డు పక్కనే గతంలో వున్నచోటనే ఏర్పాటు చేయనున్నామని జగ్గారెడ్డి తెలిపారు. నేషనల్‌ హైవే రోడ్డు విస్తరణలో పండ్ల దుకాణాలు, పాన్‌ డబ్బాలు, టిఫిన్‌ బండ్లు పెట్టుకునే స్థలాలు కోల్పోయిన వారికి రోడ్డు విస్తరణ పనులు పూర్తికాగానే తిరిగి డబ్బాలు దుకాణాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఆయన వెంట టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ తోపాజి అనంత కిషన్‌, సంగారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కూన సంతోష్‌, వైస్‌చైర్మన్‌ షఫీ హఫీజ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement