జహీరాబాద్ టౌన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు వ్యాఖ్యానించారు. మండలంలోని మధులై తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఉప సర్పంచ్ ప్రేమ్‌రాథోడ్ ఆయన అనుచరులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని, ఎంతోమంది గిరిజనులను రాజకీయ నేతలుగా తయారుచేశారని కొనియాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తండా అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ, నాయకులు అమిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


