అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

అనుసరణీయం

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

దొడ్డి కొమురయ్య మార్గం

మంత్రి దామోదర

రాజనర్సింహ

దొడ్డి కొమురయ్య విగ్రహానికి

నివాళులర్పిస్తున్న దామోదర

సంగారెడ్డి జోన్‌: సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమురయ్య చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కొమురయ్య జయంతి సందర్భంగా శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్‌ ప్రావీణ్య హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన ధైర్యసాహసాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, సంగారెడ్డి, ఇస్నాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు కూన వనిత, సుమలత, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి జగదీశ్‌, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement