విద్యార్థులకు సీపీఆర్‌పై శిక్షణ
నర్సాపూర్ రూరల్: స్టడీ టూర్‌లో భాగంగా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలో సీపీఆర్‌పై ఒక్కరోజు శిక్షణకు హాజరయ్యారు. దీంతో పాటు ఆటోమేటెడ్ ఎక్సటర్నల్ డీపీబ్రిలేటర్ ఏఈడీ వినియోగంపై నిపుణులు అవగాహన కల్పించారు. గాంధీ మెడికల్ కళాశాలలోని అటానమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ప్రయోగశాలను సందర్శించి అవగాహన పొందారు. విద్యార్థుల వెంట ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి, జంతుశాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ సురేశ్ కుమార్ ఉన్నారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, అనుభవాత్మక విద్య, ప్రజారోగ్యంపై అవగాహన, సామాజిక సేవా దృక్పథం పెంపొందించడానికి ఈ టూర్ ఉపయోగపడుతుందని అధ్యాపకులు తెలిపారు.


