పొలం బాట.. అన్నదాతకు బాసట | - | Sakshi
Sakshi News home page

పొలం బాట.. అన్నదాతకు బాసట

Feb 3 2026 8:40 AM | Updated on Feb 3 2026 8:40 AM

పొలం బాట.. అన్నదాతకు బాసట

పొలం బాట.. అన్నదాతకు బాసట

చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థినులు పొలం బాట పట్టారు. సోమవారం కరీంనగర్‌ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు మండలంలోని గంగాపూర్‌లో పర్యటించారు. నెల రోజుల టూర్‌లో భాగంగా రైతులతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతులకు కొత్త విషయాలు చెబుతూ.. వారు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పంట దిగుబడి పెంచడానికి మెలకువలు, ఎన్ని తడులు పెట్టాలి, ఎప్పుడు కోతలు చేపట్టాలనే అంశాలు వివరిస్తున్నారు. గ్రామంలో పర్యటించడం వల్ల ఎన్నో కొత్త అంశాలు తెలుసుకుంటున్నామని విద్యార్థినులు హస్విత, ప్రత్యూష, మంజూష, మేఘన, శివానీ, ఫిర్దౌస్‌ పేర్కొన్నారు. వీరితో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి జయంత్‌ కుమార్‌ పలు సూచనలు, సలహాలు చేశారు.

గంగాపూర్‌లో విద్యార్థుల పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement