బొమ్మ, బొరుసు ఆడుతున్న..
ఆరుగురి అరెస్ట్
కొల్చారం(నర్సాపూర్): బొమ్మ బొరుసు ఆడుతున్న ఆరుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్టు చేకశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... దుంపలకుంట శివారులోని వాటర్ ట్యాంక్ సమీపంలో బొమ్మ బొరుసు ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు మెదక్ టాస్క్‌ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,054 , నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కొల్చారం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో తండ్రు పోచయ్య, పెద్దాపుట్టి లక్ష్మణ్, డప్పు అశోక్, ఉసికె లడ్డు, కోలా కల్యాణ్, గళ్ల జెషోబు ఉన్నారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు.


