జీవన్మూక్త సంస్థానంలో ఆరాధన
మునిపల్లి(అందోల్): జీవన్మూక్త సంస్థానంలో సంస్థాన పీఠాధిపతి శమత బాల్‌రాజ్ జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. సోమ వారం మండలంలోని అంతారం జీవన్మూక్త మహారాజ్ సంస్థానంలో జీవన్మూక్త మహారాజ్‌తో పాటు పాండు రంగ విఠలేశ్వర రుక్మాబాయి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లకీ సేవ, భక్తి శ్రద్ధలతో భక్తులు భజన చేస్తూ సంస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.


