‘సింగూర్’ నుంచి మట్టి తరలింపు
జేసీబీ, ట్రాక్టర్‌పై కేసు
మునిపల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్టు దిగువ భాగం మల్లారెడ్డి పేట గ్రామ శివారులో నీరు లేకపోవడంతో అక్రమంగా కొందరు మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్‌ఐ సుభాష్ వివరాల ప్రకారం... ప్రభుత్వ నిబంధనల ప్రకారం సింగూర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ స్థలంలో మట్టిని తరలించవద్దని ఇంతకు ముందే ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియజేశారు. కొందరు జేసీబీతో, ట్రాక్టర్‌లో నల్ల రేగడి మట్టిని కొంత మందికి అమ్ముకుంటున్నట్లు తెలువడంతో బుదేరా పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారని ఆర్‌ఐ తెలిపారు.


