క్రమశిక్షణ అలవర్చుకోవాలి
సీనియర్ జడ్జి కవితాదేవి
జహీరాబాద్ టౌన్: పిల్లలు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లింగల్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్ జి.కవితాదేవి సూచించారు. పట్టణంలోని సిద్ధార్థ హైస్కూల్‌లో శనివారం లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ..పిల్లలు పెద్దలను గౌరవించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగిఉండాలని స్పష్టం చేశారు. సందర్భంగా గుడ్, బ్యాడ్ టచ్‌ల గురించి వివరించారు.
వెంకటాపూర్ ఇన్‌చార్జి
హెచ్‌ఎం సస్పెన్షన్
నారాయణఖేడ్: మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం కాశీనాథ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటన అనంతరం షోకాజ్ నోటీసు జారీచేసి వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పాఠశాల ఆవరణలో నిర్మించిన వంటగదిని గుత్తేదారు అప్పగించని కారణంగా చాలాకాలంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇంటివద్దే వండి పాఠశాలలో వడ్డిస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఉపాధి హామీ చట్టాన్ని
కొనసాగించాలి: నర్సింహులు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు డిమాండ్ చేశారు. మండలంలోని నిజాంపూర్ గ్రామంలో ఆయన శనివారం పర్యటించి ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాని స్వరూపాన్ని మార్చి వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
టెట్ మినహాయింపునివ్వాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించడంతోపాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ నెల 5న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ..ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపింఛను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణలో ఎమ్మెల్యే చింతా
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా కొత్త జీవోను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రూపొందించిన డైరీ–2026ని శనివారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాబట్టి ప్రతీ జర్నలిస్టు సంక్షేమానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు.
క్రమశిక్షణ అలవర్చుకోవాలి
క్రమశిక్షణ అలవర్చుకోవాలి


