ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ డ్రైవర్లు విధి నిర్వహణలో ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిద్దిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. సీట్ బెల్ట్ ధరించాలని, వాహనం హెడ్ లైట్స్, వైపర్లు సరిగా పనిచేసేలా చూసుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదన్నారు. బస్సులను ఎక్కడ పడితే అక్కడ నిలిపి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించొద్దని, విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్, వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఉపేందర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, డీఎం భవభూతి, ఎస్‌ఐ విజయ్‌భాస్కర్, సిబ్బంద పాల్గొన్నారు.
ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా


