ఓటు చోరీపై దేశవ్యాప్త ఆందోళన
పటాన్‌చెరు టౌన్: ఓటు చోరీపై దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు డివిజన్‌లో జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ... గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, వారి భాగస్వామ్య పార్టీలు ఓడిపోతాయని అనేక సర్వేలు చెప్పాయన్నారు. కానీ ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ఈవీఎంలను మార్పులు చేసి, ఓటు చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు గంగాధర్, రవి గౌడ్, నాయకులు సురేశ్, సుధాకర్, యువరాజ్ పాల్గొన్నారు.


