కరువైన కట్నాలు
మల్లన్న కల్యాణం..
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణంలో కట్నాలు కరువయ్యాయి. కొంతకాలంగా స్వామి వారి కల్యాణంలో మంత్రులు, ప్రముఖులు స్వామి వారికి కట్నాలు చదివించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కాంగ్రెస్ నాయకులు కట్నాలు చదివించారు. ఈ సారి ఎవరు కూడా కట్నాలు చదివించకపోవడంతో స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
కల తప్పిన వీఐపీ గ్యాలరీ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆలయ అధికారులు స్వామి వారి కల్యాణ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యేలు, మంత్రులకు , ప్రజాపతినిధులకు సరిగా అందించకపోవడంతో కల్యాణానికి ప్రముఖులు హాజరు కాకపోవడంతో వీఐపీ గ్యాలరీ కల తప్పింది.
వైభవంగా రథోత్సవం
స్వామి వారి కల్యాణం అనంతరం స్వామి వారి రథోత్సవాన్ని అధికారులు, అర్చకులు, భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన సత్రం నుంచి మల్లన్న గుట్టచుట్టూ రథోత్సవం నిర్వహించారు. ఈ సమయంలో భక్తుల కోలాహలం, మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
మల్లికార్జున స్వామి కల్యాణంలో మంత్రి కొండ సురేఖ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. స్వామి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనంతరం కల్యాణ వేదిక ప్రాంగణంలోనే విలేకరులతో ప్రభుత్వ పాలసీ గురించి మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు.
కరువైన కట్నాలు


