సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్
చిన్నశంకరంపేట(మెదక్): సర్పంచ్‌గా పోటీ చేస్తున్న తన భార్యకు ఓట్లు వేయకుండా కుట్ర చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు శంకర్‌నాయక్ సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి తండాలో ఆదివారం జరిగింది. పోలీసులు సముదాయించి కిందకు దించారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. తండా అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయినప్పటికీ తనకు ఓట్లు వేయకుండా ప్రత్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచి కుట్ర చేశారని ఆరోపించారు. మనస్తాపంతో సెల్‌టవర్ ఎక్కానని చెప్పారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి దుషాని గెలిచింది.


