ఒకే కుటుంబం పేరుతో 20 దొంగ ఓట్లు
కర్ణాటక రాష్ట్రంలో కూడా ఓట్లు ఉన్నాయంటూ ఇక్కడి అభ్యర్థులు ఓటు వేయకుండా అభ్యంతరం తెలిపారు. మొగుడంపల్లి మండలంలోని గొటిగార్ పల్లి గ్రామంలో ముగ్గురు కుటుంబ సభ్యులకు, హైదరాబాద్లో నలుగురికి ఓట్లు ఉన్నందున అక్కడి ఓటరు లిస్టులను తీసుకొని వచ్చి అధికారుల వద్ద అభ్యంతరం తెలిపారు. దీంతో ఓటర్లు మనస్తాపంతో ఓటు వేయకుండా వెనుదిరిగి వెళ్లారు. ఒకే కుటుంబం పేరుతో 20 దొంగ ఓట్లను నమోదు చేయించి వేయించుకున్నారని బీఆర్‌ఎస్ మద్దతు దారులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఓటరు లిస్టులను ప్రదర్శించారు. – జహీరాబాద్:


