బ్రహ్మోత్సవాల నాటికి రైల్వేస్టేషన్.. ఎంపీ రఘునందన్ రా
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల నాటికి రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను స్థానికుల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో పనులు చాలా వేగంగా పూర్తి అవుతాయనేందుకు ఈ రైల్వే స్టేషనే నిదర్శనమన్నారు. 2024 ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించగా, డిసెంబర్ 2025 నాటికి వంద శాతం పూర్తయ్యాయని తెలిపారు. సంక్రాంతికి రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ పక్కన గల 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కాటేజీలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. ప్రభుత్వం అనుమతిస్తే రైల్వే స్టేషన్ ప్రారంభించిన రోజే కాటేజీలకు భూమి పూజ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు స్వరూప, మల్లేశ్ యదవ్, నాగరాజు, కరుణాకర్ పాల్గొన్నారు.
కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో మల్లికార్జున స్వామి,మేడలమ్మ, కేతమ్మలను తీసుకొస్తున్న నిర్వాహకులు


