సిగాచి బాధితులను ఆదుకోండి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: సిగాచి బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు, ఎస్పీ పరితోష్ పంకజ్‌కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. నాలుగు నెలలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. ఆగమేఘాల మీద రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల నష్ట పరిహారం సైతం ఇప్పటివరకు అందలేదన్నారు. గత ప్రభుత్వం పరిహారాలు వెంటనే విడుదల చేసేదని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామన్న పరిహారం వెంటనే బాధితులకు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గడిల శ్రీకాంత్‌గౌడ్, మోహిజ్‌ఖాన్, బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


