నామినేషన్ కేంద్రాల పరిశీలన
హత్నూర(సంగారెడ్డి): మండలంలోని బోరపట్లలో స్థానిక ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
కంగ్టి(నారాయణఖేడ్): స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎంపీడీఓ సత్తయ్యతో పాటు ఎస్‌ఐ దుర్గారెడ్డి గురువారం పరిశీలించారు. మండలంలోని ఎన్కెమురి, దామర్‌గిద్దా, జమ్గి(కే), బాన్సువాడ తదితర గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సరిపడా భవనాలు, ఫర్నీచర్, విద్యుత్ సదుపాయం, సిబ్బందికి అవసరమైన సదుపాయాలు పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు ఓట్లు వేసేందుకు రావడానికి ర్యాంప్‌లు పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.


