పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చొద్దు
సంగారెడ్డి టౌన్: పంట కోతల తర్వాత వ్యర్థాలను కాల్చడంతో భూసారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లా అదనపు వ్యవసాయశాఖ అధికారి వెంకటలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు వరి కొయ్యలు కాల్చడం–నష్ట నివారణ చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. రైతులు పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీ, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వరి కొయ్యలు తగలపెట్టవద్దు
కల్హేర్(నారాయణఖేడ్): వరి కోతలు పూర్తి చేశాక కొయ్యలను తగలబెట్టవద్దని ఖేడ్ డివిజన్ ఏడీఏ నూతన్‌కుమార్ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని బీబీపేట్‌లో పర్యటించారు. వరి కొయ్యలు కాల్చితే నేలలోని సేంద్రియ పదర్థాలు, పోషకాలు నశిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, రైతులు రామకృష్ణగౌడ్, సంగమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
వరి కొయ్యలను కాల్చొద్దు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మండలంలోని రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వరి కొయ్యలను కాల్చొద్దని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ... వ్యవసాయ క్షేత్రాల్లో కూలీల కొరత నేపథ్యంలో రైతులు వరి కోత యంత్రాలైన ఆర్వెస్టర్లను వినియోగిస్తుండడంతో గడ్డి వినియోగం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. దీంతో పశుసంపద గడ్డిని సేకరించకుండా వదిలేస్తున్నారన్నారు. దీంతో గడ్డిని దహనం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. దహనం చేయడంతో ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు.
జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి వెంకటలక్ష్మి


