తొలిరోజు నామినేషన్లు షురూ
సంగారెడ్డి టౌన్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల హడావిడి మొదలైంది. మొదటి విడతలో భాగంగా జిల్లాలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంగారెడ్డి మండలంలోని 11 గ్రామాల్లో ఎన్నికల జోరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆశవాహులుగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లను వేసేందుకు సిద్ధమయ్యారు. మండలంలో నాలుగు క్లస్టర్లలో నామినేషన్లను అందజేస్తున్నారు. ఇస్మాయిల్ ఖాన్ పేటలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మంజుల నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలని ఎస్పీ పంకజ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెంట డీఎస్పీ సత్తయ్య, ఎంపీడీఓ నిహారిక, తహసీల్దార్ జయరాం, మండల అధికారులు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నామినేషన్ల పర్వం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలైంది. మండలంలోని వెల్టూర్, వెంకటాపూర్, పెద్దాపూర్, ఆరూర్, మద్దికుంట, ఆత్మకూర్, కంభాలపల్లి క్లస్టర్లలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా క్లస్టర్లలో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా వార్డ్ స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు చేశారు.
మొదటి రోజు నామినేషన్లు జోరు
హత్నూర (సంగారెడ్డి): మండలంలో 38 గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో మొదటి రోజు 20 సర్పంచ్ నామినేషన్లను అభ్యర్థులు వేసినట్లు ఎంపీడీఓ శంకర్ తెలిపారు. మండల వ్యాప్తంగా 11 క్లస్టర్లు ఏర్పాటు చేయగా సర్పంచ్ అభ్యర్థుల కోసం 20 నామినేషన్లు, వార్డు మెంబర్ల కోసం 29 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నామినేషన్ల ప్రక్రియ షురూ
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గ్రామపంచాయతీకి సంబంధించి 2 సర్పంచ్ స్థానాలు, రెండు వార్డు స్థానాలు, మంబాపూర్ రెండు, నాగిరెడ్డిగూడెంకు ఒక వార్డు, రామిరెడ్డిబావికి 1 సర్పంచ్ స్థానం, మొత్తం 5 సర్పంచి స్థానాలకు, 3 వార్డు స్థానాలకు మొదటి రోజు నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ తెలిపారు.
3 గ్రామాలకు 6 నామినేషన్లు..
పటాన్‌చెరు టౌన్: మండల పరిధిలోని నందిగామ, భానూర్, క్యాసారం మూడు గ్రామాలకు 6 మంది సర్పంచుల నామినేషన్‌లు దాఖలు చేయగా.. మూడు గ్రామాల వార్డుల స్థానాలకు 17 నామినేషన్‌లు వచ్చినట్లు మండల ప్రత్యేక అధికారి ఐనీష్, ఎంపీడీఓ యాదగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తొలిరోజు నామినేషన్లు షురూ


