విద్యాసామగ్రి అందజేత | - | Sakshi
Sakshi News home page

విద్యాసామగ్రి అందజేత

Nov 28 2025 11:35 AM | Updated on Nov 28 2025 11:37 AM

విద్య

విద్యాసామగ్రి అందజేత

నారాయణఖేడ్‌: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 80 మంది విద్యార్థులకు గురువారం ఆర్టీసీ డిప్యూటీ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు, ఝాన్సీలక్ష్మిలు అమెరికాలో ఉన్న తమ కూతురు బిందు సాహితీ, సంతోష్‌ల సహకారంతో నోట్‌బుక్స్‌, పెన్నులు, ఇతర విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయసాధనలో విద్యార్థులు ముందుండాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మన్మథకిషోర్‌, ఉపాధ్యాయులు యాదగిరి, హామీద్‌, చంద్రశేఖర్‌, ఆర్టీసీ సిబ్బంది భాస్కర్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

తపస్‌ నూతన కమిటీ ఎన్నిక

నారాయణఖేడ్‌: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారులు, పరిశీలకులుగా రాష్ట్ర బాధ్యులు పెంటారెడ్డి, సునార్‌ రమేష్‌, దత్తాత్రి, సుధాకర్‌ వ్యవహరించారు. అధ్యక్షుడిగా రతన్‌సింగ్‌, ప్రధాన కార్యదర్శిగా కమ్మరి కిరణ్‌కుమార్‌, గౌరవ అధ్యక్షుడిగా వడ్ల రాజయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా నందప్ప, ప్రతాప్‌, మహిళా కార్యదర్శిగా మహాదేవి, కోశాధికారిగా యోగేశ్‌, చాప్టా(కె) కాంప్లెక్స్‌ కన్వీనర్‌గా అనంత పద్మనాభం, సంజీవన్‌రావుపేట కాంప్లెక్స్‌ కన్వీనర్‌గా సుదర్శన్‌, ఖేడ్‌ కాంప్లెక్స్‌ కన్వీనర్‌గా జగదీశ్‌ను ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే నివాసంలో మహాపడిపూజ

నారాయణఖేడ్‌: ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో గురువారం పురోహితులు మలమంచి మోహన్‌ జ్యోషి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులతోపాటు కుటుంబ సభ్యులు, అయ్యప్పస్వామి దీక్షాధారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమారులు, భక్తులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిక

హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు ఎమ్మెల్యే సునీత రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గురువారం ఆయనతోపాటు పార్టీలో చేరిన తన అనుచరులకు మాజీ మంత్రి హరీష్‌ రావు బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కాసాలకి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

దోమల నివారణకు చర్యలు

జిన్నారం(పటాన్‌చెరు): బొల్లారం పట్టణ పరిధిలోని 19వ వార్డులో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కార్మికులు దోమల నివారణకు ఫాగింగ్‌ చేశారు. ఈ సందర్భంగా వార్డులోని ఇళ్లు, పరిసరాలు, రోడ్లు తదితర ప్రాంతాల్లో మిషన్‌తో ఫాగింగ్‌ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక

నిజాంపేట(మెదక్‌): 69 ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో భాగంగా తూప్రాన్‌లో జరిగిన ఉమ్మడి మెదక్‌ జిల్లా రగ్బీ సెలెక్షన్‌న్‌ అండర్‌–14 విభాగంలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు నిజాంపేట విద్యార్థి బద్రీనాథ్‌ ఎంపికయ్యారు. మహబూబాబాద్‌ లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని పాఠశాల ప్రధానోధ్యాయులు మహేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో పీడీ ప్రవీణ్‌, ఇతర ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు.

భోంగోండేశ్వర విగ్రహావిష్కరణ

కంగ్టి(నారాయణఖేడ్‌): మండలంలోని నాగుర్‌(బీ)లో గురువారం కుర్మ సంఘం కుల బాధ్యులు ఏర్పాటు చేసిన మహాత్మ భోంగొండేశ్వర విగ్రహాన్ని గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపుమల్‌శెట్టి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ప్రసాద్‌, ఖేడ్‌ ఉపాధ్యక్షుడు బీర్‌గొండ మండల అధ్యక్షుడు చంద్రుగొండ తదితరులు పాల్గొన్నారు.

విద్యాసామగ్రి అందజేత 
1
1/2

విద్యాసామగ్రి అందజేత

విద్యాసామగ్రి అందజేత 
2
2/2

విద్యాసామగ్రి అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement