ఉచిత మెగా వైద్య శిబిరం
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి శివారులో గల జీఎంఆర్ కాలనీలో ఆర్వీఎం ఆస్పత్రి సౌజన్యంతో స్థానిక ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ దండే రమాకాంత్ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


