యువతి అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హిమబిందు వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన మధు కుమారి (21) హైదరాబాద్ మదీనగూడ పరిధిలోని షాపింగ్ మాల్‌లో పనిచేస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది.
ఇంటి నుంచి బయటకు వెళ్లి..
చేగుంట(తూప్రాన్): బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల ప్రవీణ్ జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. బంధువులు, స్థానికుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులకు పిర్యాదు చేశారు.
నర్సాపూర్‌లో వ్యక్తి..
నర్సాపూర్‌రూరల్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని రుస్తుంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొన్యాల దుర్గయ్య ఈనెల 12న మధ్యాహ్నం ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు బంధువులు వద్ద, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పనికి వెళుతున్నానని చెప్పి..
పనికి వెళుతున్నానని చెప్పి..