
ద్విచక్ర వాహనాలు సీజ్
సంగారెడ్డి క్రైమ్: నిబంధనలకు విరుద్ధంగా డబుల్ సైలెన్సర్లతో ప్రజల ప్రశాంతతకు భంగం కల్గిస్తున్న ద్విచక్ర వాహనదారులపై పట్టణ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... వాహనాదారులు రోడ్లపై శబ్దం చేస్తూ వెళ్లడం ద్వారా శబ్ద కాలుష్యానికి కారకులవుతున్నారని తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ఐబీ, పోతిరెడ్డి పల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యాన్ని సృష్టించిన వాహనదారులను 50 మందికి పైగా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.