
ఆక్రమణల తొలగింపు
జహీరాబాద్ టౌన్: రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని దత్తగిరి కాలనీలో ఆక్రమణలను తొలగించిన అధికారులు రంజోల్‌లోని అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం కోర్టు రోడ్డులో డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ రోడ్డులో స్థలాన్ని కబ్జా చేసి డబ్బాలు ఏర్పాటు చేశారు. కాగా పార్కింగ్‌కు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాయవాదులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన మూడు డబ్బాలను తొలగించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.