
బాబోయ్ దొంగలు
ఇటీవల అక్బర్‌పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలో పక్కింటి వ్యక్తి ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఇంట్లోకి చొరబడి ఆమైపె దాడి చేసి బంగారు పుస్తెలతాడును తీసుకుని పరారయ్యాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్నారు.
మూడు నెలల క్రితం అక్బర్‌పేట – భూంపల్లి చౌరస్తాలో ఓ మహిళ ఒంటరిగా ఉదయం వాకింగ్‌కు వెళ్లగా ఆమైపె దాడి చేసి బంగారం గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఆమె ఆస్పత్రి పాలైంది.
సంవత్సరం క్రితం ఇదే గ్రామంలో మహిళ కల్లు దుకాణంలో కల్లు విక్రయిస్తుండగా మాట కలిపి ఆమె మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు.
దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో ఆరు నెలల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో నుంచి నగదు డబ్బులు, బంగారం ఎత్తుకెళ్లారు.
● ఒంటరి మహిళలే టార్గెట్ ● పెరుగుతున్న బంగారం ధరలు ● రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
దుబ్బాకరూరల్: రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే బెంబెలెత్తిపోతున్నారు. ప్రస్తుతం రూ.లక్షా30వేలకు చేరింది. ఆర్థికంగా ఉన్న కుటుంబాలు ధర ఎంత పెరిగిన అవలీలగా కొనుగోలు చేస్తున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచర్ల దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి.
ఒంటరిగా కనిపిస్తే అంతే..
బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అపహరించడానికి ఎంతకై నా తెగిస్తున్నారు. చైన్ స్నాచర్లు ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. దారి వెంట వెళ్తున్న వారి మెడలో బంగారం కనిపిస్తే కనిపిస్తే చాలు బలవంతంగా లాక్కెళ్తున్నారు. దీంతో మహిళలు కిందపడి గాయాల పాలవుతున్నారు. కొందరు స్నాచర్లు బైక్‌పై వచ్చి అడ్రస్ అడిగినట్లు నమ్మించి పుస్తెలతాడును తెంపుకెళుతున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మహిళలపై దాడి చేసి బంగారం లాక్కెళ్తున్నారు.
కొన్ని ఘటనలు..