
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేటజోన్: సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక విపంచి ఆడిటోరియంలో జరిగిన మాజీ సైనికుల ఆత్మీ య సమ్మేళనం, అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల్లో సైనికులు ఉద్యోగాలు చేస్తుంటే, ఇక్కడ వారి పిల్లలు నాన్ లోకల్ అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం వీర సైనికుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ప్రతినిధులు జోజి, మల్లిక్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 267మందికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే హరీశ్ రావు పంపిణీ చేసి మాట్లాడారు. మార్కెట్‌లో రైతులు పండించిన మక్కలను కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.