
ఐక్యతతోనే రాజకీయంగా ఎదగాలి
జహీరాబాద్ టౌన్: ఐక్యంగా ఉంటూనే రాజకీయపరంగా ఎదగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీసీ సంఘం నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం బీసీ సంఘం నాయకులు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 42% రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు పార్టీలకతీతంగా మద్దతు తెలపాలని కోరారు.
ప్రతీబిడ్డకు పోలియో
చుక్కలు వేయాలి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం, భారతినగర్ డివిజన్, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణంలో ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు.
మట్టి అక్రమ రవాణాపై
ఫిర్యాదు చేస్తాం
మట్టి టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం పట్టణ కేంద్ర సమీపంలోని సర్వేనంబర్ 1లో నిబంధనలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా అక్రమ మట్టి రవాణా సాగుతోందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. మట్టి తరలిస్తున్న వ్యక్తులతో వాదనలకు దిగారు. మట్టి రవాణాకు సంబంధించి అనుమతులు రెన్యూవల్ కాకుండా యథేచ్ఛగా మట్టిని తరలించడంపై మండిపడ్డారు. అక్రమార్కులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా మహాసభలను
జయప్రదం చేయండి
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య
పటాన్‌చెరు టౌన్: సదాశివపేట పట్టణంలో ఈనెల 19న జరిగే సీఐటీయూ జిల్లా నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక భవన్‌లో జరిగిన కిర్బీ పర్మినెంట్, క్యాజువల్ కార్మికుల సమావేశానికి రాజయ్య హాజరై మాట్లాడారు. సీఐటీయూ నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడుతుందన్నారు.
కార్మిక సమస్యల
పరిష్కారానికి కృషి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని జనశక్తి పార్టీ రామ్ విలాస్ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ పేర్కొన్నారు. భెల్‌కాలనీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన నేతలను ఆదివారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి నేతలు తపన్‌ధరం, శాంతను మండల్‌లు తనను మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.

ఐక్యతతోనే రాజకీయంగా ఎదగాలి

ఐక్యతతోనే రాజకీయంగా ఎదగాలి