
బోర్డులు మార్చండి సారూ!
సంగారెడ్డి నుంచి అందోల్, నర్సాపూర్, హైదరాబాద్, నారాయణఖేడ్ వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు పూర్తిగా పాడయ్యాయి. కొన్ని చోట్ల అక్షరాలు, దూరాన్ని సూచించే నంబర్లు చెరిగిపోయాయి. ప్రమాదాలు జరుగు స్థలాలు, వేగపరిమితిని చూపించే బోర్డుల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అర్ధరాత్రి వేళ ప్రయాణించే వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఇవి పాడైనప్పటికీ అధికారులు మాత్రం బోర్డులు మార్చటం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సూచిక బోర్డులు మార్చాలని వాహనదారులు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

బోర్డులు మార్చండి సారూ!

బోర్డులు మార్చండి సారూ!

బోర్డులు మార్చండి సారూ!