
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీపీ అనురాధ తెలిపారు. మంగళవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో హుస్నాబాద్ డివిజన్ పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలన్నారు. కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలని సూచించారు. డయల్ 100కు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లాలన్నారు. హోంగార్డులతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ అనురాధ