
బేకరీకి రూ.2 వేల జరిమాన
దుబ్బాకటౌన్: బేకరీకి అధికారులు రూ.2 వేల జరిమాన విధించారు. దుబ్బాక పట్టణంలో బేకరీలో అపరిశుభ్ర వాతావరణంలో నాణ్యతలేని తిను బండారాలను తయారు చేస్తూ, గడువు ముగిసిన వాటిని విక్రయిస్తుండటంతో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ జరిమాన విధించినట్లు తెలిపారు. మంగళవారం సిబ్బందితో బేకరీని తనిఖీ చేసి, ఆహార పదార్థాల తయారీ గది, స్టోర్ రూమ్, ఇతర తినుబండారాలను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కాలం చెల్లిన తినుబండారాలను గమనించారు. మరోసారి నాణ్యతలేని ఆహార పదార్థాలను విక్రయిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌చార్జ్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు.