
తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: తల్లీ ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఎస్‌ఐ వెంకటరెడ్డి వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రానికి చెందిన శరణప్ప బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం భార్య, ముగ్గురు పిల్లలతో వచ్చి ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ దేవస్థానం వద్ద ఉంటున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న శరణప్ప డ్రైవింగ్ పనిపై బయటకు వెళ్లి తిరిగి మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య దుర్గమ్మ, ముగ్గురు పిల్లలు ధన్‌రాజ్(13), నాగరాజ్(8), రమాదేవి(7) కనిపించలేదు. దీంతో తెలిసిన వారి వద్ద, స్థానికంగా, స్వగ్రామం కర్ణాటకలో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.