
భూ పరీక్షల ఆధారంగానే ఎరువులు
కొమురవెల్లి(సిద్దిపేట): భూ పరీక్షల ఆధారంగానే పంటలకు ఎరువులు వాడాలని , ప్రస్తుతం అందించే సాయిల్ కిట్‌తో రైతులు స్వయంగా మట్టి పరీక్షలు చేసుకోవచ్చని భారతీయ పరిపరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్టు డాక్టర్ జయకుమార్ అన్నారు. శనివారం మండలంలోని కిష్టంపేట గ్రామంలో భారత వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, త్రినేత్ర ఫౌండేషన్‌లు ఎస్సీ ఉప ప్రణాళికలో భాగంగా 100 మంది రైతులకు సాయిల్ కిట్, బ్యాటరీ స్ప్రేయర్‌లు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా సాయిల్ కిట్, స్ప్రేయర్ వాడకంపై రైతులకు శిక్షణనిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులు ఇష్టానుసారంగా రసాయన ఎరువులను వాడి భూమిని విషతుల్యం చేయవద్దన్నారు. తక్కువ ఎరువులు వాడుతూ సేంద్రియం వైపు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధన సీనియర్ సైంటిస్టులు డాక్టర్ బ్రిజేంద్ర, జశ్వంత్ కుమార్, బీజేపీ కేంద్ర, రాష్ట్ర సమన్వయ కర్త నూనే బాల్‌రాజు, భారతి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు స్వరూప, రాజు, మురళి, రజనీకాంత్, రైతులు పాల్గొన్నారు.
డాక్టర్ జయకుమార్