విద్యార్థిని చితకబాదిన టీచర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన టీచర్‌

Sep 21 2025 9:11 AM | Updated on Sep 21 2025 9:11 AM

విద్య

విద్యార్థిని చితకబాదిన టీచర్‌

చిన్నకోడూరు(సిద్దిపేట): అకారణంగా విద్యార్థిని చితకబాదిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు శనివారం ఎంఈఓ యాదవరెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని రామంచ గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌ ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉపాధ్యాయుడు సలీమ్‌ విద్యార్థిని అకారణంగా చితకబాదాడు. గతంలో కూడా ఈ టీచర్‌ ఇలానే కొట్టాడని పేర్కొన్నాడు. దీంతో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో కక్ష పెట్టుకున్నాడని వాపోయాడు. అకారణంగా గాయపర్చిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ సతీశ్‌ను వివరణ అడగగా సలీమ్‌ పాఠశాలలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్నాడని, అతడ్ని విధుల్లోంచి తొలగించామన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

రేగోడ్‌(మెదక్‌): అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఏఎస్‌ఐ శంకర్‌, పోలీసులు సిబ్బంది పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో పోచారం చౌరస్తా వద్ద పెద్ద తండా నుండి నారాయణఖేడ్‌ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో దాదాపు 30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తుండగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శనివారం సివిల్‌ సప్లై అధికారులు రేషన్‌ బియ్యాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న మెగావత్‌ రాజుపై కేసు నమోదు చేశారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

నిజాంపేట(మెదక్‌): పేకాట ఆడుతున్న ఏడుగురిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజేశ్‌ కథనం ప్రకారం... మండల పరిధిలోని వెంకటపూర్‌ (కె) గ్రామ శివారులో గోపరి రమేశ్‌కు చెందిన పౌల్ట్రీ ఫామ్‌లో అతడితో పాటు పేకాట ఆడుతున్న కుక్కుదు నవీన్‌, గువ్వలెగి రమేశ్‌, కుక్కుదు రమేశ్‌, చిగుల్లా మధు, గోపరి నాగరాజు, కుక్కుదు అనిల్‌ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50,960 నగదు, 6 సెల్‌ ఫోన్లు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వీరిని శనివారం సత్ప్రవర్తన గురించి సంవత్సర కాలం పాటు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గోవా మద్యం స్వాధీనం

జహీరాబాద్‌ టౌన్‌: గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను ఎకై ్సజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్‌ ఎస్‌ఐ.కోటేశ్వర్‌ గౌడ్‌ వివరాల ప్రకారం...జిల్లా సూపరింటెండెంట్‌ నవీన్‌చంద్ర ఆదేశాల మేరకు శనివారం మండలంలోని చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఈ క్రమంలో ట్రావెల్స్‌ బస్సు, తదితర వాహనాల్లో తరలిస్తున్న వివిధ బ్రాండ్స్‌కు చెందిన 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం

నిజాంపేట(మెదక్‌): అధికారి వేధింపులు భరించలేక పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రంలో కొమ్మాట ఇందిర 12 ఏళ్లుగా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో మూడు నెలల నుంచి జీతాలు చెల్లించే విషయంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు ఇబ్బందులకు గురిచేస్తూ జీతం ఇవ్వడం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఇందిర శనివారం మధ్యాహ్నం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం నార్సింగ్‌ ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థిని చితకబాదిన టీచర్‌1
1/2

విద్యార్థిని చితకబాదిన టీచర్‌

విద్యార్థిని చితకబాదిన టీచర్‌2
2/2

విద్యార్థిని చితకబాదిన టీచర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement