
పూల పండుగ.. అమ్మకు అర్చన
ఆధ్యాత్మిక సంరంభానికి తెరలేచింది. ఉత్సవాల నెలవు అశ్వయుజ మాసం పండుగలను మోసుకొచ్చింది. దసరా శరన్నవరాత్రోత్సవాలు, బతుకమ్మ పండుగ సంబురాలతో భక్తి పారవశ్యం, ఉత్సాహ భరిత వాతావరణం అలుముకోనున్నది. వేదఘోష, విశేషపూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరియనున్న నేపథ్యంలో ఈ వారం సాక్షి కథనం. – వర్గల్(గజ్వేల్):
– గౌరారం విజయ్‌రావు
దసరా నవరాత్రోత్సవాల వైభవం
● బతుకమ్మ సంరంభం
● ఆధ్యాత్మికతల అశ్వయుజ మాసం
● ఎల్లెడలా పండుగ వాతావరణం
శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం నుంచి నవమి వరకు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు నవ రూపాల్లో విశేషాలంకరణలో సకల శక్తిస్వరూపిణి అమ్మవారిని పూజించేందుకు ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, గ్రామాల్లో అమ్మవారి మండపాలు ముస్తాబయ్యాయి. మరోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ ఆదివారం నుంచి ప్రారంభమవుతుండగా.. పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు తరుణీమణులు సిద్ధమవుతున్నారు.
పెత్తర అమావాస్య ఉయ్యాలో...
దుబ్బాక: భారతీయ సంస్కృతి మనకు ముందుగా నేర్పింది. మాతృదేవోభవ, పితృతేవోభవ. ఆ తర్వాతే ఆచార్యుడైనా, అతిథి అయినా, చివరకు దేవతలైనా సరే కన్నతల్లిదండ్రులను మొదటగా పూజించాలి. మరణించిన మన వంశోద్ధారకుల కోసం ఏడాదిలో భాద్రపదమాసం బహుళ పక్షంలోని 15 రోజులు మహాలయ పక్షంగా పరిగణిస్తారు. మన మూలాలను మనకు గుర్తు చేసే మంచి సమయం పితృపక్షం. మొన్నటి పున్నమి తెల్లవారి పాడ్యం నుంచి వచ్చే అమావాస్య వరకు మన వంశవృక్షాన్ని పెంచి పెద్ద చేసిన మాతృ, పితృ దేవతలంతా కొలువుదీరే కాలం ఆఖరిరోజు పెత్తర అమావాస్య. ఏడాదికి ఒక్కసారి వచ్చే అమావాస్యను చాల గొప్పరోజుగా జరుపుకుంటారు.
తొమ్మిది రోజులు..
తొమ్మిది పేర్లతో..
వర్గల్ మండలం చౌదరిపల్లిలో బంతిపూల తోట
విశేషమైన సద్దుల బతుకమ్మ
సద్దుల బతుకమ్మను విశేషంగా భావిస్తారు. ఆ రోజు వీలైనంత ఎక్కువ ఎత్తులో బతుకమ్మను పేర్చుతారు. రంగురంగుల వివిధ రకాల పూలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇందులో మహిళలకు పురుషులు తోడ్పాటుగా నిలుస్తారు. మొక్కజొన్నలు, పెసర్లు మొదలైన ఆయా ప్రాంతాల్లో పండిన ధాన్యాలతో పాటు, చింతపండు, నిమ్మకాయ, పెరుగు, నువ్వులు, కొబ్బరి తదితరాలతో సద్దులు చేసి బతుకమ్మకు నివేదిస్తారు.
ప్రకృతిలో పూల వాతావరణం
బతకమ్మ పండుగ వచ్చే తరుణంలో ప్రకృతిలో మార్పులు కనపడతాయి. ప్రకృతి రకరకాల పూలతో అలంకరించుకుంటున్నట్లు ఉంటుంది. చెరువులు, జలాశయాలు నీటితో నిండుగా మారుతాయి. బతుకమ్మ ఆడి నీటిలో వదిలిన తర్వాత చెరువులు పూల సోయగంతో అలరారుతాయి. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు పూలపండుగ బాసటగా నిలుస్తుంది. అమ్మవారి శరన్నవరాత్రులతో బతుకమ్మ పండుగకు అవినాభావ సంబంధం కన్పిస్తుంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మను ఆరాధిస్తారు.

పూల పండుగ.. అమ్మకు అర్చన

పూల పండుగ.. అమ్మకు అర్చన

పూల పండుగ.. అమ్మకు అర్చన