
దశదినకర్మ కెళ్లి స్నానం చేస్తుండగా..
చిన్నశంకరంపేట(మెదక్): స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని సూరారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బీపేట రమేశ్(32) కుటుంబ సభ్యులతో కలిసి పెదనాన్న దశదినకర్మలో పాల్గొనేందుకు వెళ్లాడు. రెడ్డిచెరువు వద్ద తలవెంట్రుకలు తీసుకుని చెరువులో స్నానం చేసేందుకు దిగాడు. ఈ క్రమంలో రమేశ్ ప్రమాదవశాత్తు చెరువులోని గుంతలో జారి పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చెరువులోంచి బయటకు తీసినప్పటికీ అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చెరువులో మునిగి యువకుడు మృతి