
ఆన్‌లైన్ సేవలపై అవగాహన
● హుగ్గెల్లిలో పర్యటించిన యూపీసర్పంచ్‌ల బృందం ● పాల్గొన్న జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి
జహీరాబాద్: తెలంగాణలో ప్రజలకు అందిస్తున్న ఆన్‌లైన్ సేవల గురించి జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి ఉత్తరప్రదేశ్ సర్పంచ్‌ల బృందానికి అవగాహన కల్పించారు. మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి గురువారం 30 మంది సర్పంచ్‌లు, కార్యదర్శుల బృందం వచ్చింది. ఈ సందర్భంగా రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలకు గ్రామాలలో ఆన్‌లైన్ విధానంలో అందిస్తున్న సేవల గురించి జానకీరెడ్డి, ఇతర అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేయడం, ఆన్‌లైన్‌లో ఇంటి అనుమతులు పొందడం, జనన మరణాల నమోదు చేయడంతో పాటు ఎన్ని రకాల సేవలను అందిస్తున్నామనే విషయాల గురించి తెలిపారు.