
విద్యార్థి స్థాయి నుంచే సేవా భావం
అదనపు ఎస్పీ మహేందర్
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థి దశనుంచే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. గురువారం మండలంలోని రాయిలాపూర్‌లో నర్సాపూర్ డిగ్రీ కళాశాల యూనిట్–1 ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతోపాటు సేవాకార్యక్రమాలు ఎంతో ముఖ్యమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాల ద్వార క్రమశిక్షణ, సేవాభావం అలవడుతుందన్నారు. తాను సైతం విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. వారంరోజుల పాటు కుటుంబాన్ని విడిచి గ్రామంలో సేవాకా ర్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం బాలికలు సైతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌కుమార్, రాయిలాపూర్ హెచ్‌ఎం జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సలీం, విద్యార్థులు పాల్గొన్నారు.