
కార్లను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
గుండెపోటుతో వ్యక్తి మృతి
చేగుంట(తూప్రాన్): మాసాయిపేట శివారు లో జాతీయ రహదారి పై గురువారం ఉద యం ఓ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కార్లను ఢీకొనగా బస్సులోని వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామా బాద్ వెళ్తున్న ఏసీ స్లీపర్ ట్రావెల్స్ బస్సు మాసాయి పేట శివారులో కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ వాసి రాజ్‌కుమార్‌పాల్(35) మృతి చెందినట్లు గుర్తించారు. అయితే అతను మేడ్చల్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన చికిత్స కోసం వచ్చి తిరిగి వెళ్తుండ గా మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు మృతు డి వివరాలు సేకరించి గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. అనంత రం కేసు నమోదు చేసి మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు దుకాణాల్లో చోరీ
నర్సాపూర్: మండల కేంద్రంలో బుధవారం రాత్రి రెండు దుకాణాల్లో చోరీ జరిగిందని ఎస్‌ఐ లింగం తెలిపారు. పట్టణంలోని మార్కెట్ రోడ్డులోని రవిశంకర్‌కు చెందిన దుకాణం షెటర్ తాళం పగుల గొట్టి రూ.2వేల నగదు ఎత్తుకుపోయారని ఆయన చెప్పారు. అలాగే పట్టణంలోని కృష్ణచారి నగల దుకాణంలో 20తులాల వెండి ఎత్తుకుపోయారని చెప్పారు. ఇద్దరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.