
ఇద్దరు దొంగల అరెస్టు
జహీరాబాద్ టౌన్: ఇద్దరు దొంగలను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు టౌన్ ఎస్‌ఐ వినయ్‌కుమార్ తెలిపారు. పట్టణ సమీపంలోని పస్తాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు గురువారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా పట్టుకుని విచారించామన్నారు. పట్టణానికి చెందిన ఎండీ జమిలోద్దీన్, ఎండీ పైజోద్దీన్‌లు ఈ నెల 12 తేది రాత్రి బీదర్ చౌరస్తా వద్ద భవానీ వైన్స్‌లో రూ. 50 వేల నగదు, 15 మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. అనంతరం వారి వద్ద రూ. 6,700 నగదు, మోటారు బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో రిమాండ్ చేశామని ఎస్‌ఐ వివరించారు. ఈ మేరకు దొంగలను పట్టుకున్న ఐడీ పార్టీ సిబ్బంది నర్సింలు, అస్లాం, ఓందేవ్, ఆనంద్, హరిలను అభినందించారు.