
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి
సంగారెడ్డి టౌన్: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన సంఘటన గురువారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సదాశివపేటకు చెందిన విజయలక్ష్మి (56), కుమారుడు ప్రతాప్, కోడలు అరుణ కలిసి బైక్‌పై వెళ్తున్నారు. అయితే పోతిరెడ్డిపల్లి చౌరస్తా సిగ్నల్ వద్ద వెనక నుంచి ఆయిల్ లారీ అతివేగంతో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్‌ను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.