హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Sep 19 2025 6:17 AM | Updated on Sep 19 2025 6:17 AM

హ్యాం

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఉమ్మడి మెదక్‌ జిల్లా హ్యాండ్‌బాల్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ వర్కింగ్‌ సెక్రటరీ సౌందర్య తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా విద్యార్థు లు రాణించి ఉమ్మడి మెదక్‌ జిల్లా టీంలకు ఎంపికయ్యారన్నారు. అండర్‌–14 బాలుర విభాగంలో 7 మంది, అండర్‌–14 బాలికల విభాగంలో నలుగురు, అండర్‌–17 బాలుర విభాగంలో 5 మంది, అండర్‌–17 బాలికల విభాగంలో 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపా రు. అనంతరం ఉమ్మడి మెదక్‌ జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థులు

దుబ్బాకరూరల్‌: మండంలోని హబ్సిపూర్‌లో ఉన్న మహాత్మాజ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికై న పదో తరగతి విద్యార్థులు కిరణ్‌, భవదీష్‌లను ప్రిన్సిపాల్‌ గోపాల్‌రెడ్డి అభినందించారు. అదే విధంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కోసం కృషి చేసిన పీఈటీ తరుణ్‌రాజ్‌లను పాఠశాల సిబ్బంది అభినందించారు. అయితే ఈ నెల 25నుంచి 28 వరకు నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ జరిగే పోటీల్లో పొల్గొంటారని తెలిపారు.

హ్యాండ్‌బాల్‌ పోటీలకు కొడకండ్ల విద్యార్థులు

గజ్వేల్‌రూరల్‌: రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు గజ్వేల్‌ మండలంలోని కొడకండ్ల పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఐదుగురు విద్యార్థు లు ఎంపికై నట్లు ఆ పాఠశాల పీడీ విశాల పేర్కొన్నారు. ఈ మేరకు సాత్విక్‌, అక్షయ, హర్ష వర్ధన్‌, అవంతిక, రమ్యలు అత్యుత్తమ ప్రతిభ ను చాటి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి కళాఉత్సవ్‌

పోటీలకు ఎంపిక

దుబ్బాక: మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి కళాఉత్సవ్‌ పోటీలకు ఎంపికయ్యారు. గురువారం జరిగిన జిల్లా స్థాయి కళాఉత్సవ్‌ పోటీల్లో మొత్తం 12 విభాగాలకు గాను 6 విభాగాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో నాలుగు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. థియేటర్‌ ఆర్ట్‌ విభాగంలో పదో తరగతికి చెందిన ఐశ్వర్య, త్రీడీ ఆర్ట్‌ సమూహంలో సృజన ప్రథమ స్థానాల్లో నిలిచారు. అలాగే 2 డీ ఆర్ట్‌ విభాగం డ్రాయింగ్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌ విద్యార్థి క్రాంతికుమార్‌ ద్వితీయ స్థానం పొందారు. ఈ సందర్భంగా మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎంఈఓ ప్రభుదాసు, ప్రిన్సిపాల్‌ బుచ్చిబాబు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ లక్ష్మీనర్సవ్వ, సీఆర్పీ నవీన్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

స్తంభంపై నుంచి పడి

పంచాయతీ వర్కర్‌ మృతి

రామాయంపేట(మెదక్‌): మండలంలోని లక్ష్మాపూర్‌లో పంచా యతీ వర్కర్‌గా పనిచేస్తున్న అనుముల నర్సింలు (38) గురువారం ఉదయం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఉదయం గ్రామంలో తాగునీరు సరఫరా చేసే బోరు మోటర్‌ పనిచేయకపోవడంతో నర్సింలుతో పాటు మరో ఇద్దరు పంచాయతీ వర్కర్లు ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్‌ చేసి విద్యుత్‌ లైన్లను పరిశీలించారు. అనంతరం ఊర కుంటలో నీటిలో మునిగి ఉన్న కరెంటు స్తంభంపై వైర్లు రెండు ఒకే చోట కలవడంతో కరెంటు ట్రిప్‌ అవుతుందని మనించారు. ఈ సమయంలో నర్సింలు చెరువులో ఉన్న స్తంభం ఎక్కుతున్న క్రమంలో నీటిలో పడిపోయాడు. స్తంభం పై నుంచి నీటిలో పడిపోయిన నర్సింలు పైకి తేలకపోవడంతో వెంటనే గాలించారు. కొద్దిసేపటి తర్వాత అతని మృతదేహం లభించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధురాలి మృతి

నారాయణఖేడ్‌: నిజాంపేట్‌లోని జాతీయ రహదారి 161 ఫ్లైఓవర్‌ కింద 85 ఏళ్ల వృద్ధురాలు గురువారం మృతి చెందింది. పెద్దశంకరంపేట మండలంలోని మల్కాపూర్‌కు చెందిన వడ్డెర చిన్నమ్మ(85) భిక్షాటన చేస్తూ జీవిస్తుందని స్థానికులు తెలిపారు. ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ లేరని, భిక్షాటన చేసుకుంటూ ఫ్లైఓవర్‌ వద్ద నివసించేదని స్థానికులు తెలిపారు.

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక 1
1/2

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక 2
2/2

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement