
కమ్యూనిస్టులే.. సాయుధ పోరాట వారసులు
హుస్నాబాద్‌రూరల్: తెలంగాణ సాయుధ పోరాట వారసులు భారత కమ్యూనిస్టు నేతలేనని సీపీఐ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సోమవారం మహ్మదాపూర్‌లో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది కమ్యూనిస్టులేనన్నారు. చరిత్ర చెరిపేస్తే పోయేది కాదని ఏడాది పాటు సాగిన సాయుధ పోరాటంలో 4,500 మంది సీపీఐ నేతలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆనాటి సాయుధ పోరాటంను హిందు, ముస్లింలకు జరిగినట్లుగా బీజేపీ నాయకులు చిత్రీకరించి చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చి 13 ఏళ్లు గడిచినా విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మల్లేశ్, శ్రీనివాస్, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.