నిరుద్యోగులకు వరంగా డీట్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు వరంగా డీట్‌

Sep 16 2025 8:46 AM | Updated on Sep 16 2025 8:46 AM

నిరుద్యోగులకు వరంగా డీట్‌

నిరుద్యోగులకు వరంగా డీట్‌

● నమ్మకంగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం ● జాబ్‌ మేళాలు, రిక్రూట్‌ మెంట్‌ డ్రైవ్‌లలో పాల్గొనే అవకాశం ● మోసపూరిత కంపెనీల భయం లేకుండా ఉద్యోగావకాశాలు లభిస్తాయి ● వివిధ నైపుణ్యాలు, అర్హతలు కలిగిన అభ్యర్థులకు తగిన ఉద్యోగాలను సూచిస్తుంది ● కేంద్రీకృత ప్లాట్‌ ఫామ్‌ ద్వారా నిరంతర నియామక ప్రక్రియలు ● పరిశ్రమ నిర్దిష్ట నైపుణ్య అవసరాలను తీర్చడానికి తగిన శిక్షణ కార్యక్రమాలు ● అభ్యర్థికి ఎంపిక విధానం, ప్లేస్‌మెంట్‌ ప్రయత్నాలకు నిరంతర మద్దతుగా నిలవడం.

పదో తరగతి నుంచి పీహెచ్‌డీ చేసినఅందరూ అర్హులే జిల్లాలో యువత 7.20లక్షలు..నమోదైన నిరుద్యోగులు 10,774 జిల్లాలో దాదాపు లక్షకు పైగానిరుద్యోగ యువత

కప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ కార్యాలయాలు కీలకపాత్ర పోషించేవి జిల్లా ఉపాధి కేంద్రాల్లో నమోదైన సీనియారిటీని బట్టి ఉద్యోగ సమాచారాన్ని అభ్యర్థులకు అందజేసేవి. కాలక్రమేణా వచ్చిన మార్పులకనుగుణంగా ప్రైవేటు ఉద్యోగాల ఇన్ఫర్మేషన్‌ను కూడా డిజిటల్‌ రూపంలో అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ’(డీట్‌) యాప్‌ ఇప్పుడు నిరుద్యోగుల పాలిట వరంగా మారింది.

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి):

నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ’(డీఈఈటీ/డీట్‌) యాప్‌ను తీసుకొచ్చింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్‌ సంస్థల సమన్వయంతో రూపొందిన ఈ ఏఐ ఆధారిత డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం నిరుద్యోగులకు నమ్మకమైన ఉద్యోగావ కాశాలను కల్పిస్తోంది. ఈ యాప్‌తో యువత బోగస్‌ కంపెనీలు, మోసగాళ్ల బారిన పడకుండా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.

ఖాళీల సమాచారం

డీట్‌యాప్‌ ద్వారా పరిశ్రమలు, కంపెనీలు తమ ఖాళీలను నిరుద్యోగుల మొబైల్‌ఫోన్లకు పంపిస్తాయి. ఈ సమాచారంలో విద్యార్హతలు, వేతన వివరాలు, ఖాళీల సంఖ్య, మౌఖిక, రాత పరీక్షల వివరాలు ఉంటాయి. ఈ విధంగా సమగ్ర సమాచారం అందిన నిరుద్యోగులు నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరుకావచ్చు. యాప్‌కు కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను అనుసంధానం చేశారు. దీంతో ఇది మరింత సమర్థవంతంగా, వేగవంతంగా సేవలను అందిస్తోంది. పదో తరగతి నుంచి ఎంఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్హతలు కలిగినవారు ఎవరైనా ఈ యాప్‌లో నమోదుకావచ్చు. ఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ప్రైవేట్‌ రంగంలో ఖాళీలున్నా వారి అర్హతల ఆధారంగా ఉద్యోగ సమచారం లభిస్తుంది.

ప్రయోజనాలివే...

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా...

ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ నుంచి లేదా గూగుల్‌ప్లే స్టోర్‌ నుంచి డీట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పేరు, పుట్టినతేదీ, సెల్‌నంబర్‌, ఈమెయిల్‌ఐడీ, విద్యార్హతలు, టెక్నికల్‌ కోర్సులు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆశించే ఉద్యోగరకం, పనిచేయాలనుకునే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి.

వినియోగించుకోవాలి

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డీట్‌లో నమోదు చేసుకున్న యువతకు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోని కంపెనీల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పుటికప్పుడు వారి ఫోన్లకు నోటిఫికేషన్లు అందుతాయి. వాటి ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.

– తుల్జా నాయక్‌,

జిల్లా పరిశ్రమల అధికారి(జీఎం)

యాప్‌లో నమోదైతే ఫోన్లకు ప్రైవేట్‌ ఉద్యోగాల సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement