
మార్షల్‌ఆర్ట్స్‌తో ఆత్మవిశ్వాసం
వర్గల్(గజ్వేల్): మార్షల్ ఆర్ట్స్ బాలికలకు ఆత్మరక్షణతోపాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందింపజేస్తాయని పూలే బాలికల గురుకుల బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు అన్నారు. సోమవారం గురుకులంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు డైనమిక్ షోటోకాన్ అసోసియేషన్ బెల్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 104 మంది విద్యార్థులకు వారి స్థాయిలను బట్టి బ్రౌన్, పర్పుల్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో బెల్ట్‌లను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గోవిందరావు, స్పోర్ట్స్ ఇన్‌చార్జి శాలిని, పీడీ లోకేశ్వరి పాల్గొన్నారు.
104 మందికి బెల్ట్‌లు ప్రదానం