తహసీల్దార్ కార్యాలయం వద్ద
పీడీఎస్‌యూ ఆందోళన
సదాశివపేట(సంగారెడ్డి): పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సరస్వతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ...ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ క్రమం తప్పకుండా విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయడం లేదన్నారు. దీంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి పరిహారం అందించాలి
సంగారెడ్డి జోన్: సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం వెంటనే అందించాలని కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందినా ఇప్పటివరకు యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు పరిహారం అందలేదని మండిపడ్డారు.
వంద పడకల ఆస్పత్రిగాఅప్‌గ్రేడ్ చేయాలి
డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అనిల్
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రభుత్వ హాస్పిటల్‌ను వందపడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌చేసి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని సందర్శించి అక్కడి సమస్యలను రోగులు, సహాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రోగులకు సరిపోను పడకలు లేక మెరుగైన సదుపాయాలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారన్నారు.
భూసేకరణ నోటిఫికేషన్‌రద్దు చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: నిమ్జ్‌కోసం ఝరాసంగం మండలంలోని ఎల్గొయి గ్రామంలో 195 ఎకరాల భూసేకరణకు వేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ రైతులు చేస్తున్న ధర్నాకు సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...సారవంతమైన, బహుళ పంటలు పండే వ్యవసాయ భూములను పరిశ్రమల పేరుతో బలవంతంగా లాక్కోవడం సరికాదన్నారు.
రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి