
చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాదులు
దుబ్బాక: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని మతోన్మాదులు చరిత్రను వక్రీకరించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో సీపీఎం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి ,వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడికే భూమి దక్కాలని దొరలు, భూస్వాములు, రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో పోరాటాలు నిర్వహించి 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. ఈ సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భాస్కర్, జిల్లా నాయకులు గోపాలస్వామి, నవీన, భాస్కర్, ఎల్లయ్య, సాధిక్ పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి